ప్రతి ఒక్కరిని వైయస్సార్‌ కుటుంబంలో చేర్చాలి

కడియం : నియోజకవర్గంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరిని వైయస్సార్‌ కుటుంబ సభ్యునిగా చేర్పించాలని వైయస్సార్‌సీపీ రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్‌ గిరజాల వీర్రాజు (బాబు) అన్నారు. సోమవారం రాత్రి స్థానిక జీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపంలో నవరత్నాల సభ అనంతరం నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించినట్లు గిరజాల తెలిపారు. ఈ సమావేశంలో వైయస్సార్‌కు టుంబం లక్ష్యాన్ని వివరించారు. కార్యక్రమంలో బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు.

శహపురంలో ఘనంగా వైయస్సార్‌ కుటుంబం ప్రారంభం
శహపురం (పెదపూడి) : వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి్డ ప్రవేశపెట్టిన వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాలు కార్యక్రమం శహహపురం గ్రామంలో గల 404 బూత్‌పరిధిలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కార్యకవర్గ సభ్యుడు, జిల్లా అధికారప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా బూత్‌కమిటీ సభ్యులు పితాని హారికృష్ణ, కోలా సూరిబాబు ఆధ్వర్యంలో బూత్‌ పరిధిలో విస్తృతంగా పర్యటించి వైయస్సార్‌ కుటుంబం, నవరత్నాల సంక్షేమ పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా అలాగే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన 100 అబద్దపు హామీలు రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను తొలుతగా పితాని భావానీ, పి.శ్రీనివాసులకు అందజేశారు. ప్రజల అభిప్రాయాలు సేకరించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ పాలనలో అమలు జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న పోరాటాన్ని తెలియజేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, పార్టీ మండల కన్వీనర్‌ గాజంగి వెంకటరమణ, మండల బీసీ సెల్‌ కార్యదర్శి రాయుడు మురళీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top