ప్రతీ ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలి

విశాఖ: మునగపాకలో కొత్తమహాలక్ష్మి అమ్మవారి 3వ వార్షికోత్సవ వేడుకలు  సోమవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌తోపాటు పార్టీ శ్రేణులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్బంగా ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలన్నారు. దేవాలయాలకు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మళ్ల సంజీవరావు, ఎంపీపీ మంజు, వైఎస్సార్‌సీపీ నేతలు కాండ్రేగుల నూకరాజు, పెంటకోట సత్యనారాయణతోపాటు స్థానికులు వేగి కాశీ సూర్యనారాయణ, బుద్దవెంకటి, పెంటకోట శివతోపాటు పూరిటిగెడ్డ ప్రాంత రైతులు పాల్గొన్నారు.. 

Back to Top