బాబు పాలనలో రాష్ట్ర ప్రజలంతా రోడ్డెక్కారు

పశ్చిమ గోదావరి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలంతా రోడ్డెక్కారని వైయస్‌ఆర్‌సీపీ నేత ముదునూరు ప్రసాదరాజు విమర్శించారు. భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  వైయస్‌ జగన్‌ ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తున్నారన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురంవరకు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డిమాదిరిగా వైయస్‌ జగన్‌ కూడా పాదయాత్ర చేస్తున్నారని, ముఖ్యమంత్రి కాగానే మహానేత పథకాలను అమలు చేస్తారన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కారన్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ ప్రభుత్వం రోడ్డునపడేసిందన్నారు. వైయస్‌ జగన్‌ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top