పోటెత్తిన బహిరంగ సభలు

జన సునామీలా బహిరంగ సభలుప్రజా సంకల్ప యాత్ర. ప్రజల కోసం, ప్రజలే ఓ ప్రజానేతతో మమేకమై సాగుతున్న మహా సంకల్ప యాత్ర. ఒకప్పుడు మహానేత సంకల్పించి, మహోన్నతంగా పూర్తి చేసిన యాత్ర. నేడు ఆయన వారసుడు వైయస్ జగన్ అనుసరిస్తున్న యాత్ర. అడుగుకో సమస్య, ఊరికో విపత్తులా ఉంది రాష్ట్రం. పేదవాడి గుండెలో, గుడిసెలో దిగులు కమ్మిన చీకటి. అధికారం చేస్తున్న అరాచకం సృష్టించిన భీభత్సం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అలాంటి సమయంలోనే ప్రజలకు నేనున్నాను అండగా అంటూ వచ్చారు వైయస్ జగన్. ప్రజల గోడు విని వారికి భరోసా అందించేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముళ్లబాటలో, రాళ్లదారిలో సాగాలని జగన్ కు తెలియక కాదు. కానీ తండ్రి తనకిచ్చిన అతి పెద్ద కుటుంబాన్ని, దాని సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదని మనఃస్ఫూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకమే ప్రజలకు యువనేతకూ మధ్య వారధి. ఆ నమ్మకమే వెల్లువెత్తిన ప్రజాసమూహ సారధి. జగన్ వస్తున్న దారంతా పూలదారులుగా మలచి, హారతులతో స్వాగతం పలికి, ప్రేమతో పలకరిస్తున్నఆ ప్రజాభిమానమే యువనేత నమ్మకానికి పునాది. కాలి నడకన వెళుతుంటే కలిసి కదిలే ప్రభంజనం ఓ పక్క. రహదారిలో బాటసారులు కూడా ఆగి మరీ ఆర్తితో అన్నా అని పిలిచే పిలుపులు ఇంకో పక్క. ఊరు, వాడలన్నీ ఏకమై వచ్చి ఉత్సాహంతో వేస్తున్న ఉరకలో పక్క. ఇక ప్రజా సంకల్పం మొదలైనప్పటి నుంచీ యువనేత బహిరంగ సభలు జన సునామీలను తలపిస్తున్నాయి. ఏ కూడలిలో నిలుచున్నా కిలోమీటర్ల మేర జన ప్రవాహమే. జగన్నినాదమే. 

ప్రజా సంకల్పం నెరవేరింది

ఏ సంకల్పంతో యువనేత, ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రజా సంకల్పాన్ని మొదలు పెట్టారో ఆ లక్ష్యం నెరవేరుతోంది. ప్రజలు తమ బాధలను జగన్ తో పంచుకుంటున్నారు. తమ జీవితాల్లో ఆశ, భవిష్యత్ పై ఆశాభావం ఉన్నాయంటే అవి యువనేత వల్లే అని చెప్పుకుంటున్నారు. ఎవరి జీవితాలనైతే దగ్గరుండి చూడాలని, వారి కష్టాలను తెలుసుకోవాలని ఆ మహానేత తనయుడు సంకల్పించాడో పాదయాత్ర సాక్షిగా ఆ సంకల్పానికి గొప్ప ఫలితాన్ని కూడా సాధించాడు వైయస్ జగన్. ఒక్కపూట పని చేయకపోతే రోజు గడవని నిరుపేదలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇవ్వాలనే నిర్ణయాన్ని ఆయన తీసుకున్నప్పుడు, అన్నదాతల పొలాలకు బోర్లను ప్రభుత్వం ద్వారానే  ఉచితంగా వేయిస్తామన్నప్పుడు దివిలో ఉన్న ఆ రాజన్న తన బిడ్డ రైతు గుండె చప్పుడు అయ్యాడని సంతోషించి ఉంటాడు. పిల్లల చదువుల ఖర్చును తానే చూసుకుంటానని భరోసా ఇవ్వడం, రైతులకు మద్దతు ధర, ఎస్సీఎస్టీలకు ఉచిత కరెంటు, నేతన్నలకు సాయం, మహిళలకు చేయూత, అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి కార్పొరేషన్లుంఒకటి రెండు కాదు ఒకదాన్ని మించి ఒకటి తెలుగు జాతి రత్నాల్లాంటి పథకాలు ప్రజల ముంగిట్లో కుమ్మరించి వెళుతున్నారు వైయస్ జగన్. 

జన సునామీలా బహిరంగ సభలు

ఇసకేస్తే రాలనంత జనం. అన్నా, జగనన్నా మా కష్టాలు నీవే తీర్చాలన్నా అంటూ పిలిచే ప్రభంజనం. యువనేత చేయి పైకెత్తి ఒక్క అభివాదం చేస్తే పులకించిపోతున్న అశేష జనవాహిని. చెరగని చిరునవ్వుతో, చెదరని ధైర్యంతో వైయస్ జగన్ ఓ కూడలిలో నిలబడితే ఆ మహానేత మరోసారి మన ముందుకొచ్చినట్టుంది అనుకుంటున్నారు జనం. అవినీతి ప్రభుత్వాన్ని నిలువునా చీల్చి చెండాడుతుంటే అభినవ అర్జునుడని కొనియాడుతున్నారు. అధికార పార్టీ అక్రమాల లోగుట్టులు విప్పి చెబుతుంటే అపర చాణుక్యుడని జై కొడుతున్నారు. బాబు భారతాన్నంతా పిట్ట కథలుగా వినిపిస్తే విజ్ఞతతో ఆలోచించడం మొదలెట్టారు. హోదా కోసం యువనేత పోరాటానికి పిలుపునిస్తే సై అంటూ సమరశంఖం పూరిస్తున్నారు. అవిశ్వాసానికైనా సిద్ధమని ప్రకటిస్తే, నీ వెన్నంటే ఉంటామంటూ మాటిస్తున్నారు. వైయస్ జగన్ నిర్వహించిన ఒక్కో బహిరంగ సభా అధికారపార్టీ గుండెల్లో ఫిరంగి గుండులా పేలుతోంది. అఖండ జన వాహిని జగన్ సైన్యంలా కనపడి భయపెడుతోంది. యుద్ధం ఎప్పుడో కాదు, ఇప్పుడే మొదలైపోయిందేమో అని తెలుగు దేశం పార్టీలో గుబులును పెంచుతోంది. 

ప్రజల మాటే మేనిఫెస్టో

ఇది మాటవరసకు చెప్పిన మాట కాదు.ప్లీనరీలోనూ, ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభంలోనూ వైయస్ జగన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నవరత్నాలే కాదు పాదయాత్రలో ప్రజల అవసరాలను తెలుసుకుని, వాటితోనే ప్రజా మేనిఫెస్టో తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడో పార్టీ ఆఫీసుల్లో కూర్చుని, ఎసి గదుల్లో చర్చించి తెచ్చే మేనిఫెస్టో కాదని, ప్రజల మధ్య, ప్రజలే ఏర్పాటు చేసుకునే మేనిఫెస్టో వైయస్ఆర్ కాంగ్రెస్ ది అని బహిరంగంగా ప్రకటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ, ముఖాముఖీ ల ద్వారా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, అవసరమైన చోట కొన్ని అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తూ, కొత్త హామీలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. వైశ్యులతో ముఖాముఖీలో ఓ మహిళ తమిళ నాడులో అమ్మ క్యాంటీన్ల తరహాలో మన రాష్ట్రంలోనూ రాజన్న క్యాంటీన్లు పెట్టండన్నా అని యువనేతకు సూచించారు. వెంటనే దాన్ని అమలు చేస్తామని సభాముఖంగా ప్రకటించారు వైఎస్ జగన్. ఒంటరిగా మిగిలిపోతున్న అవ్వాతాతల కోసం మండలానికో వృద్ధాశ్రమం ఆలోచనకూడా ఆయన పాదయాత్రలో ఎదురైన అనుభవాల దృష్ట్యా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమే. పేదలకు ఉచిత కరెంటు, ఉద్యోగులకు పిపిఎస్ విధానం రద్దు, ఎపిపిఎస్సీ క్రమంతప్పకుండా నిర్వహించడం వంటివెన్నో ప్రజల సలహా సూచనల మేరకు ప్రకటించిన నిర్ణయాలే. 
ప్రజల నాడి తెలిసిన నాయకుడు, తెలుసుకోవాలని తపించే నాయకుడు వైయస్ జగన్. అందుకే ఆయనకు అంతులేని ఆదరణ. ఆప్యాయమైన ప్రజాభిమానం. ప్రతి బహిరంగ సభ దిగ్విజయంగా సాగుతూ దాన్ని నిరూపిస్తూ ఉంది.

తాజా ఫోటోలు

Back to Top