వైయ‌స్ఆర్ ఆశయ సాధనకు కృషి

ఆమదాలవలస: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు అందరం కృషి చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధి 15వ వార్డు పాతినవారి వీధి, పూజారిపేటలో కొంత భాగంలో వైయ‌స్ఆర్‌  కుటుంభం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆ వార్డు కౌన్సిలర్‌ పొన్నాడ కృష్ణవేణి భూత్‌ కమిటీ కన్వీనర్‌ పొన్నాడ చిన్నారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని నవరత్నాల కోసం వివరించి పలుకుటుంభాలను వైఎస్సార్‌ కుటుంభంలో చేర్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  
---------------------------
నవరత్నాలతో ప్రతి ఇంటా వెలుగులు 
ఆమదాలవలస :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపకల్పన చేసిన నవరత్నాలు పథకం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతుందని పార్టీ మండల అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామూర్తి అన్నారు. మండలంలో తొగరాం గ్రామంలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాన్ని వివరించారు. వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ప్రతి కుటుంబంలో కష్టాలను పారదోలి వెలుగులు నింపేలా నవరత్నాలను రూపొందించారని తెలిపారు. చంద్రబాబు వందల సంఖ్యలో దొంగ హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ పూర్తిస్ధాయిలో నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించారని విమర్శించారు.   

తాజా ఫోటోలు

Back to Top