జిల్లా ప్లీనరీ విజయవంతం చేయండి

అనపర్తి: ఈనెల 29న కాకినాడలో నిర్వహించనున్న వైయస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని అనపర్తి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ తొలిసారిగా జిల్లావ్యాప్తంగా గల అన్ని నియోజకవర్గాలో నిర్వహించిన ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాయని సూర్యనారాయణరెడ్డి అన్నారు. కాకినాడ రూరల్‌ పరిధిలో గల తూరంగిలో కుసుమ సత్య కన్వెన్షన్‌ హాలు నందు ఈనెల 29న జిల్లా ప్లీనరీ సమావేశానికి పార్టీ జిల్లా పరిశీలకుడు ధర్మాన ప్రసాదరావు, పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ, ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీ సెల్‌ , బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.నాగార్జున, కృష్ణమూర్తి , పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి బోసు తదితరులు హాజరవుతారన్నారు. దీనికి గానూ నియోజకవర్గంలో గల పార్టీ శ్రేణులు జిల్లా ప్లీనరీకి భారీగా తరలిరావాలని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి కోరారు. ఈసమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఒంటిమి సూర్యప్రకాష్, పార్టీ మండల కన్వీనర్‌ మల్లిడి ఆదినారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాదూరి డేవిడ్‌రాజు, అనపర్తి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు మండ శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ద్వారంపూడి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పార్టీ నేతలు, కార్యకర్తలకు బోస్ పిలుపు
రామచంద్రపురం:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈనెల 29వ తేదీన కాకినాడ తూరంగిలోని కుసుమసత్య కన్వెన్షన్‌ హాల్‌లో ఈ జిల్లా ప్లీనరీ నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా సోమవారం గాంధీపేటలోని పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ కన్వీనర్‌ గాధంశెట్టి శ్రీధర్‌ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బోస్‌ మాట్లాడుతూ ప్రజలు టీడీపీ పాలనతో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వారికి అండగా ఉండేందుకు తీసుకోవాల్సిన భవిష్యత్‌ కార్యక్రమంపై ఈ ప్లీనరీలో చర్చిస్తామన్నారు. జిల్లా పార్టీ ప్లీనరీకి మాజీ మంత్రి, జిల్లా పరిశీలకుడు ధర్మాన ప్రసాదరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా మోపిదేవి వెంకటరమణ, ముఖ్య అతిథులుగా బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌కే రోజా, మాజీ మంత్రి కె. పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ ‍అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి హాజరవుతున్నారని బోస్‌ తెలిపారు. ఈ ప్లీనరీలో జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు చేస్తారన్నారు. నియోజకవర్గంలో చేసిన తీర్మానాలపై జిల్లా ప్లీనరీలో చర్చించి రాష్ట్ర ప్లీనరీ సమావేశానికి అందజేస్తారని ఎమ్మెల్సీ బోస్‌ తెలిపారు. ఈనెల 29వ తేదీ ఉదయం 8 గంటలకు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్రాక్షారామ చేరుకోవాలని ఆయన సూచించారు. అక్కడి నుంచి ర్యాలీగా తూరంగిలోని కుసుమసత్య కన్వెన్షన్‌ హాల్‌ వద్ద జరిగే ప్లీనరీ వేదిక డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రాంగణానికి తరలివెళదామన్నారు. పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి శంకర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వాసంశెట్టి శ్యాం, జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ పెట్టా శ్రీనివాసరావు, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వాడ్రేవు సాయిప్రసాద్, కౌన్సిలర్లు చింతపల్లి నాగేశ్వరరావు, వినకోటి శ్రీనివాసు, కుడిపూడి లలితాగణేష్, చింతపల్లి వెంకట్రావు, మండల కన్వీనర్‌ పంతగడ వరప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు పెంకే వీర్రాఘవులు, తోట వీరభద్రరావు, దేవా, చట్లర్‌ కర్ణ, సాదే నారాయణరావు, పిల్లి రామకృష్ణ, మానే గంగాధరరావు, మేడిశెట్టి శ్రీను, పలువురు సర్పంచ్‌లు పీవీవీ రమణ, పి. అశ్వినీకుమార్, పండు గోవిందరాజులు, చిట్టూరి వెంకట్రామయ్యచౌదరి, బత్తుల అప్పారావు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు దడాల వెంకటరమణ, విద్యార్థి విభాగం సకిలే శ్రీనివాసు, పార్టీ నాయకులు కొండేపూడి సురేష్, అనిశెట్టి చంటి, అయ్యల రాంబాబు, యూఏబీ రాజు, మద్దా ఏడుకొండలు, మల్లిమొగ్గల శ్రీధర్, కాళా జానకిరామయ్య, అయినవల్లి అబ్బు, ప్రకాశ్, గుత్తుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top