ప్రతి ఇంటికీ నవరత్నాలు

వెలుగోడు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల సంక్షేమం కోసం ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ పట్టణ నాయకులు చిన్న నరసింహులు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్‌లో వైయస్‌ర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు ఇంటింటా పర్యటించి నవరత్నాలు పథకాలను వివరించి పార్టీ సభ్యత్వం తోపాటు ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్న నరసింహులు మాట్లాడుతూ టీడీపీ పాలనలో అందరికీ అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు సంపాదించి ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో పార్టీకలకు అతీతంగా ప్రతిపేద వానికి మేలు చేశారని అన్నారు. అందుకే వైయస్‌ జగన్ సిఎం అయితే అందరికి న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ సభ్యులు నరసింహులు, కుమారి, రత్నమ్మ, మాధవి,  నీలమ్మ, విజయ్, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు:రాష్ట్రంలో పేదల సంక్షేమం జరగాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి చేరాలని వైయస్సార్‌సీపీ నాయకులు కొళ్ళు మాష పేర్కొన్నారు. గరీబ్‌ నగర్‌ లో సోమవారం వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైయస్సార్‌ సీపీ శ్రీశైలం నియోజక వర్గం ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పెద్ద ఎత్తున ప్రజలు ఆధరిస్తున్నారని తెలిపారు. దివంగత వైయస్సార్‌ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు తిరిగి అమలు జరగాలంటే వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎమ్‌ కావాలన్నారు. నేడు 50 కుటుంబాల సభ్యులు వైయస్సార్‌ కుటుంబంలో చేరారని తెలపిరు. ఈ కార్యక్రమంలో ఆ పారంల నాయకులు నూర్‌ అహమ్మద్‌ , మహబూబ్‌ బాష, సలాం, కరిముళ్ళ , రబ్బాని, మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు,

తాజా ఫోటోలు

Back to Top