ప్ర‌తి ఇంటికీ ``వైయ‌స్ఆర్ కుటుంబం``

* న‌వ‌ర‌త్నాలును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి
* వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో గోపాల్ రెడ్డి

ఆదోని టౌన్ (క‌ర్నూలు):  రాష్ట్రంలో  ప‌్ర‌తి ఇంటికీ వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాన్ని తీసుకుపోయి `న‌వ‌ర‌త్నాలు` గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ కార్యద‌ర్శి గోపాల్‌రెడ్డి, బీసీ సెల్ క‌న్వీన‌ర్ డా. మ‌ధుసూద‌న్ అన్నారు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో ఆ మ‌హానేత‌కు నివాళుల‌ర్పించిన అనంత‌రం వారు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తనయుడు వై. మనోజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. 60 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రణాళికనవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తున్నార‌ని గోపాల్‌రెడ్డి అన్నారు.  టీడీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరిం చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. టీడీపీ దౌర్జన్యాలకు ఎవరూ భయపడవద్దని గోపాల్‌రెడ్డి భ‌రోసా ఇచ్చారు. 

50 మంది యువకల రక్తదానం

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని 50 మంది యువకులు రక్తదానం చేశారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్న వినోద్‌కుమార్‌రెడ్డి, అభినేష్‌రెడ్డి, భరత్, వెంకటకృష్ణ, లింగారెడ్డి, శేషు, తిలక్, అశోక్, రామ్మెహన్‌ మిత్ర బృందం మొత 50 మంది యువకులు శనివారం ఉదయం 8 గంటలకు రెడ్‌క్రాస్‌ సొసైటీలో రక్తదానం చేశారు. ప్రతీ సంవత్సరం వైయ‌స్ఆర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజవిష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. వైయ‌స్ఆర్‌ స్ఫూర్తితో ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నందుక సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.
--------
వైయ‌స్ఆర్ ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం
ఆదోని రూరల్ (క‌ర్నూలు): దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని జెడ్పీటిసీ ఆనంద్, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తనయుడు మనోజ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మహానేత వైఎస్‌ఆర్‌ 8వ వర్ధంతి వేడుకలను ఆదోని మండలంలో ఆయా గ్రామాలో జరుపుకున్నారు. విరుపాపురంలో జెడ్పీటిసీ ఆనంద్, మనోజ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ విగ్రహానికి గజమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్‌ హనుమంతప్ప, ఎంపిటీసీ సభ్యురాలు సుశీలమ్మ, వరమ్మ, గుంటెప్ప రంగన్న, నరసప్ప, శివ, ప్రహ్లాద్, సుంకప్ప, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.Back to Top