గడప గడపకూ వైయస్సార్‌ పాలన గుర్తు చేయండి

–ప్రతీ ఒక్కరినీ వైయస్సార్‌ కుటుంబం లో చేర్చే విధంగా కృషి చేయండి
–నియోజకవర్గ స్థాయి బూత్‌ కమిటీ సభ్యులతో సమన్వయ కర్త తిలక్‌

టెక్కలి: వైయస్సార్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు నిర్వహించబోయే వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతీ వ్యక్తిని వైయస్సార్‌ కుటుంబంలో చేర్చే విధంగా కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త పేరాడ తిలక్‌ పిలుపునిచ్చారు. బుధవారం టెక్కలి లో నియోజకవర్గ స్థాయిలో బూత్‌ కమిటీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ పోలింగ్‌ బూత్‌ పరిదిలో పార్టీ ప్రతినిధులంతా ఆయా బూత్‌ స్థాయిలో కుటుంబాలను ఆత్మీయంగా కలవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హాయాంలో అందజేసిన సంక్షేమ పథకాలు, పాలన గూర్చి ఒక్క సారి ప్రజలకు గుర్తు చేయాలని తిలక్‌ కోరారు. అలాగే యువనేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రూపొందించిన నవరత్నాల సంక్షేమ పథకాల గూర్చి వివరించడంతో పాటు ఆయా కుటుంబ సభ్యులను వైయస్సార్‌ కుటుంబంలో చేర్చేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో బూత్‌ స్థాయి సభ్యులంతా సైనికుల్లా పనిచేసి యువనేత ఆదేశాలను పాటించాలని తిలక్‌ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు బి.గౌరీపతి, బి.లక్ష్మినారాయణ, ఎస్‌.హేమసుందరరాజు, నాయకులు వై.చక్రవర్తి, సత్తారు సత్యం, టి.కిరణ్, ఎన్‌.శ్రీరామ్ముర్తి, ఎన్‌.నారాయణమూర్తి, కోత ఇందిర, ఎం.నాగభూషణం, ఎస్‌.బాలకృష్ణ, రెడ్డి మాష్టారు, చింతాడ గణపతి, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు, డి.సింహాచలం, డి.సిమ్మన్న, డి.కుశుడు, టి.రాజు, చిన్ని జోగారావు, యర్రన్న, భాస్కరరెడ్డి తో పాటు నియోజకవర్గంలోని బూత్‌ స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Back to Top