ఏంటి బాబూ అంతా నీ గురించే మాట్లాడుకున్నారా?

విశాఖపట్నం

: దావోస్‌ పర్యటనలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తన గురించే మాట్లాడుకుంటున్నారని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన గురించి తాను గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. చంద్రబాబు దావోస్‌ పర్యటనల అనంతరం మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలపై బొత్స విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుపునొప్పి, కాలు నొప్పి అని విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి నువ్వు సాధించిందేంటని ప్రశ్నించారు

Back to Top