ఈవెంట్ మెనేజ‌ర్‌గా బాబు క‌రెక్ట్‌

విశాఖ‌ప‌ట్నం: హుద్‌హుద్ తుఫాన్ వ‌చ్చి రెండేళ్ల‌యినా, టీడీపీ ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు
తుఫాన్ బాధితుల‌ను ఆదుకున్న పాపాన పోలేద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ
జిల్లా అధ్యక్షులు గుడివాడ అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని తానే
 నిర్మించాన‌ని చెప్పుకునే నీచ రాజ‌కీయ నాయ‌కుడు
చంద్ర‌బాబు అని   అమ‌ర్నాథ్ ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న స్థానిక విలేక‌రుల
స‌మావేశంలో మాట్లాడుతూ....   400 ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్‌ను చంద్ర‌బాబు
క‌ట్టారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. గోల్కొండ‌, హుస్సెన్‌సాగ‌ర్‌ల‌ను కూడా చంద్రబాబే
నిర్మాణం చేశారా అని అమ‌ర్‌నాథ్ ఎద్దేవా చేశారు. 

 

కేవ‌లం ఒక్క హైటెక్‌సిటీని మాత్ర‌మే నిర్మించిన బాబు..  హైద‌రాబాద్ మొత్తాన్ని తాను నిర్మించాన‌ని  చెప్పుకోవ‌డం సిగ్గు చేట‌ని ఆయ‌న నిప్పులు
చెరిగారు.  రాష్ట్రంలో ఎవ‌రైనా బాగా ఖ‌ర్చుపెట్టి పెళ్లిళ్లు చేసుకోవాలంటే
ఈవెంట్ మెనేజ‌ర్‌గా చంద్రబాబుని పెట్టుకుంటే బ్ర‌హ్మండ‌మైన ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌న్నారు. 

ఒక్క వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే హుద్‌హుద్ తుఫాను బాధితుల‌ను
ఆదుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తుంద‌ని అమ‌ర్‌నాథ్ పేర్కొన్నారు. విశాఖ‌లో
పెట్టుబ‌డులు పెడితే తుఫాన్ వ‌ల్ల న‌ష్ట‌పోయే అవ‌కాశ‌ముంద‌ని టీడీపీ నాయకులు అన‌డం
సిగ్గుచేట‌న్నారు. టీడీపీ నేతల  వ్యాఖ్య‌ల
వ‌ల్లే  విశాఖ‌కు పెట్టుబ‌డులు రావ‌ట్లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
రూ. 400కోట్లు ఖ‌ర్చు చేసి ఉల్లిపాయ‌లు, పప్పులు ఇచ్చామ‌ని చెప్పుకున్న అధికార ప్ర‌భుత్వం
తుఫాన్ బాధితుల‌ను ఆదుకోవ‌డంలో పూర్తిస్థాయిలో విఫ‌లమైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.
 రూ. 1700 కోట్లు విలువ చేసే ద‌స్ప‌ల్లా భూముల‌ను
కాపాడేందుకు వైయ‌స్సార్‌సీపీ బ‌హిరంగ చ‌ర్చ‌కు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంద‌ని ఆయ‌న
తెలిపారు. అవ‌స‌ర‌మైన ద‌స్ప‌ల్లా భూముల‌పై సుప్రీం కోర్టుకు సైతం వెళ్లేందుకు
సిద్ధంగా ఉన్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.    

 

Back to Top