మహిళలని కూడా చూడకుండా కాళ్లతో తన్ని ఈడ్చారు

తిరుపతిః నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మహిళలని కూడా చూడకుండా అన్యాయంగా కాళ్లతో తొక్కి పోలీస్ స్టేషన్ లలో కుక్కి బాబు వికటాట్టహాసం చేశాడని ధ్వజమెత్తారు. బ్యాంకులు, ఏటీఎంలు ఎక్కడ చూసినా జాతరలను తలపిస్తున్నాయని..క్యూలైన్లలో తోపులాటలు, తొక్కిసలాటలతో ప్రజలు చనిపోతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజల ఆక్రందనను తమ గొంతు ద్వారా వినిపించాలని చూస్తే ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని భూమన ఫైర్ అయ్యారు.

Back to Top