మూడ్రోజులుగా మోడీ స్పందించకపోవడం దారుణం

ఢిల్లీ:

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మొండి వైఖరి అవలంబిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిలు మండిపడ్డారు. ఢిల్లీలో ఎంపీల దీక్షాస్థలి వద్ద వారు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌ల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారన్నారు.  మూడ్రోజులుగా దీక్ష చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. లో బీపీతో బాధపడుతున్నారని చెప్పారు. మూడ్రోజులుగా ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తున్నా.. కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడం దారుణమన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే.. చర్చలైనా జరిపేవారని,  కానీ మోడీ మొండి వైఖరి వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు ఆమరణ దీక్షను వీక్‌ చేయాలని కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారంలో ఉండి బాధ్యతగా పోరాడాల్సిన వ్యక్తులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top