ఎవరినీ ఆకట్టుకోలేకపోయిన బడ్జెట్: మేకపాటి

న్యూఢిల్లీ, 28 ఫిబ్రవరి 2013: కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ ఏ ఒక్క వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎం‌.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.‌ ఈ వార్షిక బడ్జెట్ సగటు భారతీయుడి అంచనాలకు అందని విధంగా ఉందని ఆయన గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. రైతులంతా ఆశగా ఎదురు చూసిన వ్యవసాయ రుణాల మాఫీపై ఎలాంటి ప్రకటనా ఈ బడ్జెట్ చేయలేదన్నారు. ఉద్యో‌గులకు కూడా ఈ బడ్జెట్‌ వల్ల నిరాశే మిగిలిందన్నారు.

ముఖ్యంగా ఈ బడ్జెట్ వల్ల‌ ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగింది ఏమీ లేదని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా లభిస్తుందని భావించామని, ఆ విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top