రెండవ ఎస్ఆర్‌సితోనే అందరికీ సమన్యాయం

విశాఖపట్నం, 18 ఆగస్టు 2013:

తెలంగాణపై రెండవ ఎస్సార్సీని నియమించి ఉంటే అందరికీ సమన్యాయం జరిగేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సోమవారం నుంచి గుంటూరులో చేపట్టనున్న ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని కొణతాల చెప్పారు. విశాఖపట్నంలో ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ‌చేపట్టిన పథకాలను పూర్తిచేసిన తరువాత రాష్ట్ర విభజన జరిగినా ఏ ప్రాంతానికీ అన్యాయం జరిగేది కాదని కొణతాల అభిప్రాయపడ్డారు.

తాజా ఫోటోలు

Back to Top