ఎప్పుడూ అదే విమర్శలా

గుంటూరు : తెలుగుదేశం
నాయకులు చేస్తున్న అసత్య విమర్శలపై వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి
రాజశేఖర్ మండి పడ్డారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం గూండాలు రైతుల
పొలాల్లోని పంటల్ని తగల బెట్టేసిన ఘటన, తర్వాత ఆ ప్రాంతంలో ప్రతిపక్షనేత వైఎస్
జగన్ పర్యటించటం, రైతులకు భరోసా కల్పించటం జరిగాయి. దీన్ని చూసి జీర్ణించుకోలేని
తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా విమర్శలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని
అమరావతిలో ఏం జరిగినా అందుకు కారణం వైఎస్ఆర్‑సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‑రెడ్డి  అనేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటు
అని   మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. గుంటూరు పట్టణంలో
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు తగలబడితే వైఎస్ జగనే కారణమంటూ రాష్ట్ర
మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఆయన ఏపీ మంత్రులను ఎద్దేవా చేశారు.

 

Back to Top