ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌సీపీదే విజయం

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన అంతిమ విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీదే అని ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను ఆయన తూర్పారబట్టారు. మంగళవారం నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మైనారిటీ ఓట్ల కోసమే ఇవాళ మైనారిటీ నేతలు ఫరూక్, నౌమన్‌కు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఉప ఎన్నికలో  వైయస్‌ఆర్‌సీపీ పోటీకి దిగడంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. ఉప ఎన్నికలో టీడీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 2019 ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కాలర్‌ పట్టుకొని లాగుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని కొలగట్ల తెలిపారు. 

Back to Top