ఎన్నికల ఫలితాలు తారుమారు చేసిన కాంగ్రెస్

తిరుపతి, 10 ఫిబ్రవరి 2013: తిరుపతి పట్టణ సహకార బ్యాంక్ ఎన్నిక‌ల ఫలితాలపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా వచ్చిన ఫలితాలు వైయస్‌ఆర్‌సిపి బలపరిచిన అభ్యర్థులకు అనుకూలంగా వచ్చాయని, అయితే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అధికారులను లోబరుచుకుని తుది ఫలితాలు తమకు అనుకూలంగా ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమాలు, అవకతవకలకు పాల్పడి అధికార కాంగ్రెస్ దొడ్డిదారిన గెలిచిందని కరుణాకరరెడ్డి ఆరోపించారు.

‌చివరి నిమిషంలో ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్‌ నాయకులు తారుమారు చేయించారని కరుణాకరరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి అధికారులు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు. తిరుపతి టౌన్ బ్యాంక్‌ ఎన్నికల ఫలితాలపై ‌తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తీవ్ర గందరగోళం మధ్య కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. తొలి ఐదు రౌండ్లలో వై‌యస్‌ఆర్‌సిపి అభ్యర్థులు ఆధిక్యంలో నిలవడంతో అధికారపక్ష నాయకులు చక్రం తిప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

రోడ్డుపై భూమన బైఠాయింపు:
అంతకు ముందు, తిరుపతి సహకార బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌటింగ్ తీరును వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. కౌంటింగ్ ఏకపక్షంగా జరిగిందని ‌వారు ఆరోపించారు. కౌటింగ్ తీరును నిరసిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాక‌రరెడ్డి రోడ్డుపై బైఠాయించారు.

తాజా ఫోటోలు

Back to Top