<p style="text-align: justify;" margin-bottom:0cm="">హైదరాబాద్ : సాగునీటి రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్ ల ఎదుట ఆందోళన చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొంటారని వివరించింది. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీమంత్రి, సీనియర్‌నేత డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. <p style="text-align: justify;" margin-bottom:0cm=""> కృష్ణా జలాల్ని సాధించటంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీపడినట్లుగా కనిపిస్తోందని ఆయన వివరించారు. ట్రి బ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడటంలో సర్కారు విఫలం అయిందని వివరించారు. ఓటుకు కోట్లు కుంభకోణం లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవటం వల్లే ఈ విషయంలో బాబు రాజీపడినట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులు కాలరాయటం అన్యాయమని ఆయన అన్నారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర లేకపోవటం, కృష్ణా జలాల హక్కుల్ని కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 25న కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు చేస్తామని మైసూరా రెడ్డి వివరించారు. </p></p>