ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిరెడ్డి అప్పారావు

హైదరాబాద్ 06 మార్చి 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజమండ్రికి చెందిన ఆదిరెడ్డి అప్పారావు ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అప్పారావు బీసీ నేత. ఎమ్మెల్యేల కేటగిరీలో ఆయన ఎమ్మెల్సీ బరిలో దిగనున్నారు. ఈ నెల 9న నామినేషను దాఖలుచేస్తారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బుధవారం సాయంత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను కలిశారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలన్న పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆదిరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ఎంపికచేశారు.

Back to Top