ఎండిపోయిన బత్తాయి తోట పరిశీలించిన షర్మిల

గౌరారం (నల్గొండ జిల్లా), 13 ఫిబ్రవరి 2013: ఎండిపోయిన బత్తాయి తోటను పరిశీలించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌, టిడిపిల కుమ్మక్కు, కుటిల నీతికి వ్యతిరేకంగా శ్రీమతి షర్మిల తన సోదరుడు శ్రీ జగన్‌ తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఆమె బుధవారం ఉదయం నల్గొండ జిల్లా గౌరారం గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను బత్తాయి తోటల రైతులు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. కంటికి రెప్పలా పెంచిన బత్తాయి చెట్లు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే శ్రీమతి షర్మిల ఎండిపోయిన బత్తాయి తోటలోకి వెళ్ళి చూశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధి‌ని ఏర్పాటు చేస్తారని బత్తాయి రైతులకు భరోసా ఇచ్చారు.
Back to Top