విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటాం

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి వైయస్ఆర్ సీపీ తరపున కృషి చేస్తానని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం నాటి ప్రజా సంకల్పయాత్రలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల  జెఎసి ప్రతినిధులు జననేతను కలుసుకుని మెమొరాండం సమర్పించారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా వేతనాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రమాదవశాత్తూ, విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, విద్యుత్ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ విధానాలకు స్వస్థి పలికాలని వారు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వీరి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న వైయస్ జగన్ వీటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Back to Top