రాజన్న రాజ్యంతోనే సంక్షేమ పథకాలు అమలు..!

ఫ్యాన్ గుర్తుకే మన ఓటు..!
వరంగల్ః వరంగల్ పార్లమెంటు స్థానంలో  వైఎస్సార్సీపీ ప్రచారానికి సిద్ధమైంది. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. రాజన్న రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని పొంగులేటి స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ..ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని అన్నారు.

వైఎస్. రాజశేఖర్ రెడ్డి చనిపోయి ఆరు సంవత్సరాలయినా నేటికీ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు . ప్రతి పేదవాడి మొములో చిరునవ్వు చూడాలన్నదే రాజన్న అభిమతమని..అది ఒక్క వైఎస్సార్సీపీతో మాత్రమే సాధ్యమని చెప్పారు.  రాజన్న రాజ్యం రావాలన్నా, పచ్చని పంటలు పండాలన్నా ..ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సూర్యప్రకాశ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లకు పొంగులేటి విజ్ఞప్తి చేశారు. 

టీఆర్ఎస్ అహంకార పూరిత నిర్ణయాల వల్లే వరంగల్ ఎన్నికలు వచ్చాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్, భాగస్వామ్య పక్షాలైన టీడీపీ,బీజేపీలు , ప్రతిపక్ష కాంగ్రెస్ లకు వరంగల్ ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు.  ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజాసమస్యలను గాలికొదిలేశారని నిప్పులు చెరిగారు. 
Back to Top