ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం

  • చిన్న పిల్లలను కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
  • 2014 ఆగస్టు 15న కర్నూలు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చారా
  • దేవుడి మీద ప్రమాణం చేయించి టీడీపీ నేతలు డబ్బులిస్తారు
  • ఆ దెయ్యాలు చేసే పని రాజకీయం కోసమే
  • దుర్మార్గులకు లౌక్యంగా సమాధానం చెప్పి, ధర్మం వైపు నిలబడండి
  • సాంబవరంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం
నంద్యాల: నంద్యాలలో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఈ యుద్ధంలో ప్రజలంతా ధర్మాన్ని గెలిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా సాంబవరం రోడ్‌ షోలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు. మూడున్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా రైతులను, పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను, నిరుపేదలను, ఆఖరికి చిన్న పిల్లలను కూడా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. 2014 ఆగస్టు 15న కర్నూలుకు వచ్చి ఇచ్చిన మాటల్లో ఒక్క మాటను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. ఇటువంటి మోసపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు మళ్లీ నంద్యాలలో ఉప ఎన్నికలు రాగానే టేపు రికార్డర్‌ ఆన్‌ చేసి అది చేస్తా.. ఇది చేస్తా అని వాగ్ధానాలు ఇస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇక బాబు ఆటలు సాగనివ్వం, రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని మాట్లాడిన మాటలు నెరవేర్చకపోతే చొక్కాలు పట్టుకొనైనా కిందకు లాగుతారనే సంకేతం ప్రజలు వారికి ఇవ్వాలన్నారు. 

ఆ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడు...
ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు మూటలు మూటల డబ్బు, కుట్టు మిషన్లు, ట్రాక్టర్లు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని వైయస్‌ జగన్‌ విమర్శించారు. ప్రతి ఒక్కరికి రూ. 5 వేలు చేతిలో పెట్టి ఆ డబ్బుతో పాటు జేబులో నుంచి దేవుడి పటం కూడా తీసి ఆ పటంపై ప్రమాణం చేయించుకొని మరీ మీ చేతుల్లో టీడీపీ నేతలు డబ్బు పెడతారని చెప్పారు. కానీ ఆ దేవుడు కూడా పాపానికి ఓటు వేయాలని చెప్పడని, కాబట్టి ఆ రకంగా చెప్పేది దెయ్యాలు మాత్రమేనన్నారు. ఆ దెయ్యాలు మీ దగ్గరకు వచ్చి రూ. 5 వేలు పెట్టి ఓటు అడిగితే గొడవ పడకుండా ధర్మం వైపు నడుస్తామని ఆ దేవుడిని ప్రార్థించాలన్నారు. దుర్మార్గులకు లౌక్యంగా సమాధానం చెప్పి పంపించాలని సాంబవరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటు వేసేటప్పుడు ధర్మానికే ఓటు వేయాలని, అదే దేవుడు కూడా కరెక్ట్‌ అంటాడన్నారు. దెయ్యాలు చేసే పని రాజకీయాలు కోసమే చేస్తున్నాయని, కాబట్టి న్యాయం వైపు నిలబడి వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. 
Back to Top