ఇచ్చిన మాట కోసమే పదవిని వదిలిన జగన్‌

విశాఖపట్నం:

సంక్షేమ పథకాలను కుల మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్దిదే అని వైయస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ పార్లమెంటరీ స్థానం అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ పేర్కొన్నారు. వైయస్ఆర్ సువర్ణయుగంలో ఒక్కో కుటుం బానికి నాలుగైదేసి సంక్షేమ పథకా‌లు అందాయని చెప్పారు. విద్యుత్, ఆర్టీసీ, మున్సిపల్, నీటి పన్నులేవీ ఆ మహానేత పెంచలేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మందికి ఉచిత ఆపరేషన్లు చేయించారన్నారు. దేశం మొత్తం మీద ఐదేళ్లలో 47 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. అదేకాలంలో ఒక్క మన రాష్ట్రం లోనే 48లక్షల ఇళ్లు నిర్మించిన ఘనత వైయస్ఆర్‌దే అన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లతో రాజకీయ ప్రాధాన్యత కల్పించారన్నారు. మంచి నేతను ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని ఆయన నిరూపించారని శ్రీమతి విజయమ్మ అన్నారు. విశాఖ నగరంలోని మధురవాడ, ఆనందపురం, గాజువాక, పరవాడలో ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోడ్‌షో నిర్వహించారు.

మహానేత మరణించిన ఈ నాలుగున్నరేళ్లలో తాము ఎన్నో అవమానాలకు గురయ్యామని శ్రీమతి విజయమ్మ తెలిపారు. వైయస్ మరణం తట్టుకోలేక ‌ప్రాణాలు వదిలేసిన వారిని ఓదారుస్తానని నల్లకాలువలో ఇచ్చిన మాట కోసం జగన్‌బాబు పదవిని కాదనుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ నుంచి బయటి‌కి వచ్చాక మా కుటుంబంపై కక్ష సాధింపు మొదలైంది. అయినా జగన్‌బాబు నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడారని వివరించారు. ఫీజు పోరు, జనదీక్ష, జలదీక్ష, రైతుదీక్ష, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారన్నారు. తాను కూడా వారం రోజులు నిరాహార దీక్ష చేసిన వైనాన్ని ప్రస్తావించారు.

జగన్‌బాబు ఓదార్పు యాత్రకు వచ్చిన ఆదరణను చూడలేక, చేయని తప్పుకు జగన్‌బాబును అన్యాయంగా జైల్లో పెట్టారని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ను 16నెలల వరకు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జగన్‌బాబు తన పోరాటాన్ని ఆపలేదని చెప్పారు. తనను నమ్ముకున్న వారికి అండగా ఉండాలనే నన్ను, షర్మిలను ప్రజల ముందుకు పంపించారని అన్నారు. మాటకు కట్టుబడే కుటుంబం తమదన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైయస్ఆర్‌సీపీని గెలిపించండని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించివన్నీ నెరవేరుస్తాం అని శ్రీమతి విజయప్మ భరోసా ఇచ్చారు.

Back to Top