మెంటాడ మండలాభివృద్ధికి కృషి

శ్రీ‌కాకుళం: మెంటాడ మండల అభివృద్ధికి  కృషి చేస్తున్న‌ట్లు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పేర్కొన్నారు.  మెంటాడ మండలంలో తాగునీటి సమస్య రానివ్వకుండా ఉండేందుకు మెగా మంచినీటి పథకం కింద రూ. 14 కోట్లుతో 39 గ్రామాలకు రక్షిత తాగునీరు అందించామని, ఆండ్ర, గుర్లతమ్మిరాజుపేట గ్రామాల వద్ద బ్రిడ్జిలు నిర్మాణాలు పిట్టాడ నుంచి చీపురువలస వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మెంటాడ మండలంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ, మంత్రి మృణాళిని, భంజదేవ ఎక్కడైనా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసున్నారంటే  అప్పుడు నేను మంజూరు చేసిన పనులేనని తెలుగుదేశం నాయుకులు తెలుకోవాలని ఆయన హితవు పలికారు. ఆండ్ర, తమ్మిరాజుపేటలో నాకు ఓట్లు వేయకపోయినా  రెండు గ్రామాల వద్ద బ్రిడ్జిలు అవసరమని గుర్తించి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వారినే తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. మండలంలో నేను చేయాల్సిన పనులు రెండు ఉండిపోయాయి ఒకటి జగన్నాథపురం, రెండు ఆగూరు వద్ద బ్రిడ్జీలు, రోడ్లు నిర్మించాలని అనుకున్నానని, తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఆ రెండు పనులు చేయలేకపోయానని అయితే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని చేతనైతే టీడీపీ నాయుకులు ఆ రెండు పనులు చేసి ప్రజల మనస్సులను గెలుసుకోవాలని, నేను మంజూరు చేసిన పనులను వారు మంజూరు చేసినట్లు చెప్పుకోవడానికి వారికి సిగ్గూ, లజ్జా ఉందా? అని అడుతున్నాను అని ఆయన ఆరోపించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల అధ్యక్షులు రెడ్ది సన్యాసి నాయుడు, ఎంపీపీ సింహాచలమమ్మ, బాయి అప్పారావు, కిలపర్తి మధు, చెలూరి లక్ష్మణరావు, రాయిపల్లి రామారావు, తాడ్డి సత్యం తదితర నాయుకులు పాల్గొన్నారు. 

Back to Top