అన్నివర్గాల ఆర్థికాభివృద్దికి నవరత్నాల రూపకల్పన

సీతానగరం: అన్ని వ‌ర్గాల ఆర్థికాభివృద్ధికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాల రూప‌క‌ల్ప‌న చేశార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్రకార్య దర్శి గర్భాపు ఉదయభాను అన్నారు. సీతాన‌గ‌రంలో శుక్ర‌వారం వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో అందరూ భాగస్వాములు కావాల‌న్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా,నియోజకవర్గం నేతలు కె రాఘవకుమార్, జి లక్ష్మణరావు, ఏ శివున్నాయుడు, పి ఈశ్వరనారాయణ,ఆర్‌ దసరధనాయుడు, బి అప్పలనాయుడు పాల్గొన్నారు.

Back to Top