కక్షసాధింపు చర్యలను సహించం

తూర్పుగోదావరి జిల్లా:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని పార్టీ గొల్లప్రోలు నియోజకవర్గ సమన్వయకర్త దొరబాబు హెచ్చరించారు. గొల్లప్రోలు పట్టణంలోని బల్లకట్టు వద్ద వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గ్రామ పంచాయతీ అధికారులు తొలగించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు తొలగించడం సరికాదన్నారు. అధికారుల తీరును పార్టీ నాయకులు మొగలి అయ్యారావు, తెడ్లపు  చిన్నారావు, గ్రంధి కృష్ణ తదితరులు ఖండించారు.

Back to Top