తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌క‌ర్నూలు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో తూర్పు గోదావ‌రి జిల్లా డీసీసీ మాజీ అధ్య‌క్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మెటి వెంక‌టేశ్వ‌ర్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ఆధ్వ‌ర్యంలో వెంక‌టేశ్వ‌ర్లు, ఆయ‌న అనుచ‌రులు క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి పార్టీలో చేరారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా దొమ్మెటి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న రావ‌డం, ప్ర‌జ‌లు ఆయన‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌ని భావించి తాము పార్టీలో చేరుతున్న‌ట్లు తెలిపారు. చంద్ర‌బాబు ఈ నాలుగేళ్ల‌లో రాష్ట్రాన్ని అవినీతిలో నంబ‌ర్ వ‌న్ చేశార‌ని విమ‌ర్శించారు. రాజ‌న్న రాజ్యం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే సాధ్య‌మ‌ని విశ్వ‌సించారు. 

Back to Top