వైయస్సార్సీపీలోకి తూ.గో. జిల్లా అధ్యక్షుడు

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీ నేతలు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులవుతున్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ జనగళాన్ని సమర్థవంతంగా విన్పిస్తోంది. ఈనేపథ్యంలో వైయస్సార్సీపీలో చేరేందుకు ఉత్సూహకత చూపిస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఈ నెల 12న వైయస్సార్‌ సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేస్తానని, అందుకే వైయస్సార్‌ సీపీలో చేరుతున్నానని ఆయన చెప్పారు.

Back to Top