బాబుకి ఓటమి భయం పట్టుకుంది

శ్రీకాకుళం: టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే ఓడిపోతామని చంద్రబాబుకి భయం పట్టుకుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఎవరు పోరాడినా వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. 
 
వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేకహోదా కోసం తమ పోరు కొనసాగుతుందని తెలిపారు. అసెంబ్లీ వేదికగా స్పీకర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు. భావితరాలు ఆందోళన చెందాల్సిన పరిస్ధితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Back to Top