నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాలి

  • ప్రైవేటు బస్సు వ్యాపారులంతా టీడీపీ వాళ్లే
  • అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు
  • చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు
  • గాయపడిన వారికి రూ.50 వేలు ఇచ్చి ఆదుకోవాలి
  • వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్

  • ఖమ్మంః రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అన్నారు. నాయకన్ గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై వైయస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఏ ప్రమాద ఘటన జరిగినా చంద్రబాబు అక్కడకు వెళ్లడం లేదన్నారు. ఘటన దగ్గరకు రాకపోయినా పర్వాలేదు గానీ మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బాబున సర్కార్ ను డిమాండ్ చేశారు. 

    చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనేకమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారు కోలుకునేందుకు సమయం పడుతుందని, కొన్నాళ్ల పాటు వారు పనిచేయలేని పరిస్థితి నెలకొన్నందున చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రైవేటు బస్సు సాకుతో ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రైవేటు బస్సులు సేఫ్టీ లేకుండా తీరుగుతున్నా వాటిపై యాక్షన్ తీసుకోకపోవడం దారుణమన్నారు.  ప్రైవేటు బస్సు వ్యాపారాలు చేస్తున్నవారంతా టీడీపీకి చెందిన వారైనందునే ప్రమాదాలు జరిగినా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

    తాను ఇక్కడకు రాజకీయం చేయడానికి రాలేదని, జరిగిన ఘటన పట్ల తీవ్ర దిగ్ర్భాంతి చెందానని వైయస్ జగన్ చెప్పారు. జరిగింది బస్సు ప్రమాదం అన్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.  బ్రిడ్జ్ వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్నందున దానికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుందని, త్వరగా ఆ ఇన్సూరెన్స్ వచ్చేలా చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. మనుషుల్లో మానవత్వం కదలాలని వైయస్ జగన్ సూచించారు. ఘటన జరిగినప్పుడు తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైయస్సార్సీపీ బాధితులకు అన్నవిధాలా అండగా ఉంటుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.  


Back to Top