రాక్షస పాలనలో నలిగి చస్తున్నాం

  • బాబు పాలన ఔరంగజేబు పాలనను తలపిస్తోంది
  • దళిత క్రైస్తవులంతా వైయస్ జగన్ వెంట నడవాలి
  • జగన్ అందరికీ అండగా ఉంటాడు
  • చంద్రబాబు పుట్టుక, పెంపకం, పరిపాలన అంతా అబద్ధాలే
  • దళిత, గిరిజన, క్రైస్తవులారా శిల్పాను గెలిపించండి
  • వైయ్ససార్సీపీ నేతలు మేరుగు, నారాయణస్వామి
నంద్యాలః మహానేత వైయస్ఆర్ పాలనలో దళిత చట్టాలు రక్షించబడి దళితులకు రక్షణ ఉండేదని...చంద్రబాబు వచ్చాక దళిత చట్టాలను అపహాస్యం చేస్తూ దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. నంద్యాలలో పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, సంజీవయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీ పరిపాలనలో దళితులపై దాడి జరుగుతున్నా జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ, ఆనందబాబు లాంటి దళిత నేతలు చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. మీలో నిజంగా దళిత రక్తం ప్రవహిస్తుంటే...దళితులపై దాడి పాల్పడుతున్న వారిమీద, దళితులను తిట్టిన ఆదినారాయణ రెడ్డి గురించి నిలదీయాలన్నారు.  బాబు దగ్గరున్న దళితులు దళిత ద్రోహులని విమర్శించారు. బాబుకు ఏ  ఒక్క దళితుడు ఓటు వేసినా మనల్ని మనం మోసం చేసుకోవడమేనని అన్నారు. ప్రతి దళిత గిరిజనుడు వైయస్ జగన్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని ఆనాడు వైయస్ఆర్ కేంద్రానికి ప్రపోజల్ చేశారని గుర్తు చేశారు. దాన్నే మళ్లీ ఎత్తుకున్న బాబు ఏమీ చేయకుండా దళితులను మోసం చేస్తున్నాడన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తాడని హామీ ఇచ్చారు. దళిత క్రైస్తవ సోదరులారా జగన్ వెంట నడవండి. మీకు అడంగా ఉంటాడు. శిల్పాను ప్రతి దళిత, గిరిజన, క్రైస్తవులు గెలిపించాలని మేరుగు నాగార్జున విజ్ఞప్తి చేశారు. 


బాబు పుట్టుకే అబద్ధాలు
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి
 చంద్రబాబు పరిపాలన ఔరంగజేబు పాలనను తలపిస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు.  రాక్షస పాలనలో మనం నలిగి చస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు  కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా పని చేసి ప్రతీ ఒక్కరిని వైయస్ఆర్ ఆదుకున్నారని గుర్తు చేశారు. అలాంటి కడుపులో పుట్టిన జగన్  కూడా మహానేత లాగే మంచి చేస్తాడని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. వైయస్ జగన్ ను బాబు తనతో పోల్చుకోవడం హాస్యాస్పదమన్నారు.  జగన్ ఎక్కడికిపోయినా తండోపతండాలుగా వస్తున్నారని, వైయస్ జగన్ ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.   నవరత్నాలను కుల, మతాలకతీతంగా డిక్లేర్ చేసిన వైయస్ జగన్ వెంటే ప్రజలున్నారన్నారు. వైయస్ఆర్ తన హయాంలో దళితులకు భూపంపిణీ, ఇళ్ల పంపిణీ సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి ఆదుకున్నారని...కానీ, బాబు వచ్చాక ఏదీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎస్సీ కార్పొరేషన్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులను కూడ తన ఖాతాలో వేసుకొని బాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలేనని... బాబు పుట్టుక, పెంపకం, పరిపాలన అంతా అబద్ధాలేనని నారాయణస్వామి విమర్శించారు. శిల్పా గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదన్నారు.  శిల్పా ఎప్పుడూ అబివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మాట్లాడుతున్నాడు. 20ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్లను వెడల్పు చేయమని శిల్పా కోరితే నీవు ఏమన్నావు బాబు..?  నీవు సగం ఇవ్వు, నేను సగమిస్తానని వెటకారంగా మాట్లాడలేదా..? భూమా చావుకు నీవు కాదా కారణం..?పశువు మాదిరిగా కొన్నావు అంటూ నారాయణస్వామి ఫైర్ అయ్యారు. 
Back to Top