డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారా లేదా..?

వెలగపూడి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీకి డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళలకు అప్పులు మాఫీకాక వారి పుస్తెలతాడులు బ్యాంక్‌లకు కుదవపెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు రుణమాఫీపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇంతకీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారా లేదా అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. నిన్న పెట్టిన బడ్జెట్‌లో పెట్టుబడి నిధిగా ఇచ్చే రూ. 4 వేలు కూడా అప్పుగా పెట్టారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణమాఫీపై మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top