టీడీపీ పాలనలో బీసీలకు అన్యాయం

శ్రీకాకుళం: తెలుగు దేశం పార్టీ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లాలో బీసీల సమస్యలపై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వారు ఎండగట్టారు. కృష్ణదాస్‌ మాట్లాడుతూ..బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా అగ్రకులాలకు అవకాశం కల్పించి బీసీలకు మొండిచెయ్యి చూపారని ఫైర్‌ అయ్యారు. యాదవులు, కమ్మరులు, కుమ్మరులకు ఈ సర్కార్‌ ఎలాంటి సాయం చేయడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో అణగారిన వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారని వీరి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో పేదల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, భోగాపురం పోర్టు నిర్మాణానికి టీడీపీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు భూములు పనికిరావా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత క్రమంలో సమన్యాయం చేస్తారని తెలిపారు.

Back to Top