వైయస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత

హైదరాబాద్ :

 వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు వైయస్సార్సీపీలో చేరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.


దుర్గేష్ తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో వైయస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో దుర్గేష్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. 

వైయస్‌ జగన్‌ పోరాటాలతోనే రాష్ట్రాభివృద్ధి
 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటాల ఫలితంగానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ అన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. రెండున్నరేళ్లుగా హోదా సాధనకు వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. మహానేత ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్సీ అయినట్లు చెప్పారు. అయితే బాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రజల పక్షాన నిలుస్తున్నారన్నారు. అందుకే వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పనిచేయాలని ముందుకువచ్చినట్లు చెప్పారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని దుర్గేష్‌ పేర్కొన్నారు. 


Back to Top