దుర్గమ్మ చెంత కొండంత అభిమానం

కృష్ణా నది ఒడ్డున.. కనక దుర్గమ్మ దిగువన.. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె శ్రీమతి షర్మిలకు ఘనస్వాగతం లభించింది. బెజవాడ ప్రజలు హర్షాతిరేకాలతో ఆమెను స్వాగతించి అభిమానాన్ని చాటుకున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగిడిన తొలిరోజు దృశ్యం అందరికీ ఆనందాతిరేకాలను పంచింది.
ఓ వైపు సూర్య భగవానుడు అస్తమిస్తుండగా.. ఆ దిశలోనే మరో వెలుగు దూసుకొచ్చింది. అదే జనం ఆశలకు ఊపిరి పోసే జగనన్న బాణం.. శ్రీమతి వైయస్ షర్మిల.  జలసిరి లేక వెలవెలబోయిన కృష్ణమ్మ జనకెరటంతో ఉప్పొంగింది. తమ ఆడపడుచే ఇంటికొస్తుందని భావించిన కృష్ణాజిల్లా ఆమెకు బ్రహ్మరథం పట్టింది.
విజయవాడ, 27 మార్చి 2013:

పాలకులను ప్రశ్నిస్తూ.. ప్రతిపక్షాన్ని ఎండగడుతూ.. మండువేసవిని తలదన్నేలా రాజకీయ వేడిని రగిలిస్తూ శ్రీమతి వైయస్ షర్మిల సాగిస్తున్న మరోప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో తొలి అడుగు కొత్త ఆశలకు ఊపిరులూదింది.  ప్రకాశం బ్యారేజీపై గుంటూరు జనవాహిని వీడ్కోలు పలకగా, కృష్ణాజిల్లా జనకెరటం ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది.

జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున షర్మిలకు ఘనస్వాగతం పలికారు. తీన్‌మార్, కోలాటదళాలు, డప్పులమోత, రకరకాల నృత్యాలతో అపూర్వ స్వాగతం లభించింది. అనుకున్న సమయానికే యాత్ర సాగడంతో అప్పటికే పెద్ద సంఖ్యలో చేరిన జనం రోడ్లవెంబడి బారులుతీరి రాజన్న కుమార్తెను చూసేందుకు పోటీపడ్డారు.

బ్యారేజీపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. కృష్ణానదిలో పడవపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి. బ్యారేజీ మీద నుంచి మొదలైన జనప్రవాహం శ్రీమతి షర్మిల వెంట రథం సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, ఇస్లాంపేట, రాయల్ హోటల్ సెంటర్, చేపల మార్కెట్, నెహ్రూబొమ్మ సెంటర్, చిట్టినగర్, ప్రైజర్‌పేట, పాత రాజరాజేశ్వరిపేట వరకు సాగింది.

జగన్నినాదాలతో జన స్పందన

విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద శ్రీమతి షర్మిల నిర్వహించిన తొలి బహిరంగసభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రతిపక్ష టీడీపీ చేతగానితనాన్ని తప్పుబడుతూ మాట్లాడారు. సీఎం కిరణ్, చంద్రబాబులపై విమర్శలు చేసినప్పుడు ప్రజలు కరతాళధ్వనులతో స్పందించారు. అదే సమయంలో రాజన్న, జగనన్న అని ఆమె అన్నప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు చేశారు.

నిజం చెప్పడం చంద్రబాబుకు తెలియదు
చంద్రబాబుకు నిజం చెప్పే అలవాటులేదనీ, ఆయనో అబద్ధాలపుట్టనీ ఆమె దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు చెబుతున్న చంద్రబాబు బహిరంగసభల్లో కాంగ్రెస్‌ను నరకాలని తిడుతున్నారనీ, కానీ ప్రజల కష్టాలకు కారణమైన కాంగ్రెస్‌ను అవిశ్వాస తీర్మానంలో కాపాడిన ఊసరవెల్లనీ బాబుపై నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వైఫల్యం వల్లే రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం మహానేత వైఎస్ చేపట్టిన ఎన్నో పథకాలకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. రాజన్న ఆశయాలు తీర్చడం జగనన్నతోనే సాధ్యమని షర్మిల ప్రకటించడంతో ప్రజలు కేరింతలు కొట్టారు.


వెతలు చెప్పిన వస్త్ర వ్యాపారులు
శ్రీమతి షర్మిల పాదయాత్రలో
పలువురు వస్త్ర వ్యాపారులు కలిసి ప్రభుత్వం విధించిన వ్యాట్‌తో పడుతున్న
ఇబ్బందులను వివరించారు. వ్యాపారులు చేస్తున్న నిరసన దీక్షాశిబిరాన్ని ఆమె
చూశారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు తిండి, నీడ, వస్త్రం
అవసరమని.. అటువంటిది దుస్తులపై కూడా ప్రభుత్వం వ్యాట్ విధిం చడం
దారుణమన్నారు. విజయవాడలో రెండు వేల మంది వస్త్ర వ్యాపారులు దీక్షలు
చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె దుయ్యబట్టారు. వారికి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనీ, జగనన్న సీఎం అయ్యాక వస్త్రాలపై
వ్యాట్ తొలగిస్తారనీ భరోసా ఇచ్చారు.

అడుగులో అడుగేస్తూ..
శ్రీమతి షర్మిల వెంట పలువురు రాష్ట్ర నేతలతోపాటు జిల్లా పార్టీ శ్రేణులు అనుసరించాయి. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, పి.గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, జ్యేష్ఠ రమేష్‌బాబు, జంగా కృష్ణమూర్తి, మేకా ప్రతాప్ అప్పారావు, ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు (కేఎన్‌ఆర్), మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల, పార్టీ నేతలు ఉప్పులేటి కల్పన, పడమట సురేష్‌బాబు, దుట్టా రామచంద్రరావు, ఎం.ఎస్.బేగ్, వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ (ఎస్‌ఆర్‌డీ), వేజెండ్ల శివశంకర్, దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్), పోసిన చెంచురామారావు, సింహాద్రి రమేష్‌బాబు, బి.వల్లబాయ్, మల్లెల రవి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Back to Top