అదృష్టం కొద్దీ దుర్గమ్మ కొండమీద ఉంది

విజయవాడ: తొలగించిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ తో  దీక్ష చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులను వైయస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ పరామర్శించారు. దేవాలయాల పునర్నిర్మాణం కోసం వారు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ.. మన అదృష్టం కొద్దీ దుర్గమ్మ కొండ మీద ఉందని....లేకుంటే అమ్మవారి దేవాలయాన్ని కూడా చంద్రబాబు తొలగించే వారన్నారు. 

కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విజయవాడలోని దేవాలయాలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని  విమర్శించారు. తొలగించిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని వంగవీటి డిమాండ్ చేశారు.
Back to Top