డీఎస్సీ అభ్యర్థుల అక్రమ అరెస్ట్

విజయవాడ:
రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్ల కోసం
ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై పోలీసులను ఊసిగొల్పి  అక్రమ అరెస్ట్ లకు
పాల్పడుతున్నారు.  మొన్నటికి మొన్న అంగన్ వాడీలను దారుణంగా ఈడ్చుకెళ్లి
వ్యాన్ లలో కుక్కి అరెస్ట్ చేసిన ఖాకీలు...తాజాగా డీఎస్సీ అభ్యర్థులపై
జులుం ప్రదర్శించారు. 

విజయవాడలో సీఎం క్యాంపు
ఆఫీస్ ఎదుట 2014 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు
ఫోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా భారీగా మోహరించిన
పోలీసులు వారిని అడ్డుకున్నారు. అభ్యర్థులను బలవంతంగా ఈడ్చుకెళుతూ
వ్యానుల్లో పడేశారు. అన్యాయంగా అరెస్టులు చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర
ఉద్రిక్తత చోటుచేసుకుంది.

2014లో డీఎస్సీ
నిర్వహించిన ఏపీ సర్కార్ ... ఫలితాలు ప్రకంటించినా ఇప్పటి వరకు నియామకాల
ప్రక్రియ ప్రారంభించకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈక్రమంలోనే  డీవైఎఫ్‌ఐ, 2014 డీఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది
డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీ తీశారు. నిరసన చేపట్టారు. 
Back to Top