రాష్ట్రంలో ధృతరాష్టు్రని పాలన

ఆదోని : రాష్ట్రంలో ధృతరాష్టు్రని పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలకు చేరేలా చూడడమే  లక్ష్యమని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ఆయన తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అనుచరులు మహిళపై విచాక్షణ రహితంగా దాడి చేయడాన్ని గోపాల్‌రెడ్డి ఖండించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన సుదమ్మపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ వయ్యావుల కేశవ్‌ వర్గీయులు నడిరోడ్డుపైనే చెప్పుల కాళ్లతో ఎగిరెగిరి తన్నడం, చేతులతో చావబాదడం అత్యంతం హేయమైన చర్యని ఖండించారు. అభం శుభం తెలియని నిస్సాహాయతతో జీవనం సాగిస్తున్న సుధమ్మపై దాడిచేసిన టీడీపీ వర్గీయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే భంగపాటే ఎదురైందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయానికి పెద్దపీఠ వేయడం శోచనీయమన్నారు. బాధ్యాతారాహిత్యం వహించిన పోలీసులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సుధమ్మ ఇంటిముందు నీటి తొట్టి నిర్మాణంను సర్పంచ్‌ నాగరాజు చేపడుతుండగా తనకు ఇబ్బంది అవుతుందని ఏదైనా జరిగితే చూడడానికి తనకంటూ ఎవరూ లేరని చెప్పడమే ఆమె  చేసిన నేరమా అని ప్రశ్నించారు. సర్పంచ్‌ సమక్షంలోనే టీడీపీ వర్గీయులు సుదమ్మపై దాడిచేయడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళా ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునేడు మహిళా సంక్షేమాన్ని, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. బాధితురాలు సుదమ్మకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.   ఆదోని నియోజకవర్గంలో యువతకు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పెద్దపీట వేశారని మండల గౌరవ అధ్యక్షుడు గుర్నాథ్‌రెడ్డి అన్నారు.  

Back to Top