పాత్రికేయుల‌కు ర‌క్ష‌ణ క‌రువు

క‌ర్నూలు(మంత్రాలయం): ప‌్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉంటున్న పాత్రికేయుల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ క‌మిటీ స‌భ్యుడు వై. ప్ర‌దీప్‌కుమార్‌రెడ్డి మండిప‌డ్డారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. మంగళవారం క‌ర్నూలు జిల్లా మంత్రాల‌యం మండ‌లంలోని రాంపురంలో ఆయన ఏపీయూడబ్ల్యూజే చలో విజయవాడ వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఏపీయూడ‌బ్ల్యూజే జిల్లా నాయ‌కుడు ప‌ర‌శురామ్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ప్ర‌దీప్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో పాత్రికేయులకు బాబు ఎన్నో హామీలు గుప్పించారన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలంతోపాటు రూ.2 లక్షలుపైగా వెచ్చించి ప‌క్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. బాబు అధికారంలోకి వ‌చ్చాక హామీలు విస్మ‌రించి జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌టం దారుణ‌మ‌న్నారు.  జర్నలిస్టుల సంక్షేమ నిధికి తక్షణమే రూ.50 కోట్లు విడుదల చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు చాంద్‌బాష, సాగర్,  భీమ, రఘు, దాసు పాల్గొన్నారు.

Back to Top