తాగునీటి కష్టాలు తీర్చండన్నా

తూర్పు గోదావరి: రాజమండ్రి నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీటిని తెచ్చి తాగునీటి కష్టాలు తీర్చాలని వైయస్‌ఆర్‌సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తోట సుబ్బారావు నాయుడు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మా నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయని, సామర్లకోటలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇంటి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ మండలంలో తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోదావరి నీరు కలుషితమవుతోందన్నారు. గతంలో పట్టిసీమ లేనప్పుడు గోదావరి నీరు పుష్కలంగా అందేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు నీటికష్టాలు మొదలయ్యాయని ఆందోలన వ్యక్తం చేశారు. వంతుల రూపంలో నీటిని వాడుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పెద్దాపురం టౌన్‌కు రాజమండ్రి నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి రిజర్వాయర్‌ నిర్మించి తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. గతంలో పెద్దాపురం స్కిల్‌ బట్టలు వేసుకొని బయటకు వెళ్తే రాజసం కనిపించేదన్నారు. ఇవాళ చేనేతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. టీడీపీ నాయకులకు డబ్బు సంపాదన తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ మీదా తోడాలి, కానీ ఇవాళ బోర్లు  పెట్టుకొని తోడుకుంటున్నారన్నారు. మాకు ఏలేరు రిజర్వాయర్‌ మాకు అప్పగించాలని తోట సుబ్బారావు నాయుడు వైయస్‌ జగన్‌ను కోరారు.

తాజా ఫోటోలు

Back to Top