క్రిష్ణా నది ఒడ్డునే తాగునీటి ఎద్దడి


గుంటూరు) సాక్షాత్తూ క్రిష్ణా నది ఒడ్డునే తాగునీటి ఎద్దడి
నెలకొందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి అభిప్రాయ
పడ్డారు. తాగునీటి సమస్యల మీద మంగళగిరి లో మునిసిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు
చేశారు. పట్టణంలో తాగునీటి సరఫరా కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నామని, అయితే
ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయటం లేదని ఆందోళన
వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేయాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. పుష్కరాలకు నీటి సమస్య  తలెత్తే అవకాశం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. తోపులాటలు
జరగకుండా ఉండాలంటే కరకట్టల దగ్గర ముందు నుంచే సమర్థమైన ఏర్పాట్లు జరగాలని అభిప్రాయ
పడ్డారు. 

తాజా ఫోటోలు

Back to Top