ప్రజాస్వామ్యానికి తూట్లు

నెల్లూరు: టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ..రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని సైదాపురం స‌ర్పంచ్ గీతాంజ‌లి అన్నారు.ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీస విలువలు కూడా లేకుండాపోతున్నాయ‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అడ్డ‌దారుల్లో వచ్చిన వారికి పెత్తనం కట్టబెడుతూ గ్రామపాలన వెన్ను విరుస్తున్నారని మండిప‌డ్డారు. ప్రజాప్రతినిధులకు విలువలు లేకపోతే ప్రజాస్వామ్యానికి కూడా విలువ లేనటేనని గీతాంజ‌లి  అభిప్రాయపడ్డారు.

Back to Top