దద్దమ్మ ముఖ్యమంత్రి

  • ప్రాజెక్ట్ లన్నీ వైయస్ఆర్ పుణ్యమే
  • పోలవరంలో కమీషన్ల కోసం హోదాను అమ్మేస్తారా..?
  • దేవినేని ఉమ ఓ బ్రోకర్
  • వ్యవసాయమే దండగన్నబాబు ప్రాజెక్ట్ లు కడతారట..?
  • ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పేరుతో వేలకోట్లు దోచేస్తున్నారు
  • ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించే దమ్మూ, ధైర్యం ఉందా
  • మా సవాల్ ను స్వీకరించే సత్తా బాబుకు, టీడీపీకి లేదని తేలిపోయింది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజం
విజయవాడః సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమలపై వైయస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. కేంద్రం నిర్మిస్తామన్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను తెచ్చుకొని సంకలు కొట్టుకునేందుకు ముఖ్యమంత్రికి సిగ్గుగా లేదా అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..పోలవరంలో వచ్చే కమీషన్ల కోసం ప్రత్యేకహోదాను అమ్మేస్తారా? అంటూ జోగి రమేష్ మండిపడ్డారు.  ఐదుకోట్ల మంది తెలుగు ప్రజల్ని అమ్మేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ చేతగాని దద్దమ్మ మంత్రి అని రమేష్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు, చంద్రబాబు, లోకేష్ మధ్య కమీషన్ల కోసం సంధికూర్చే బ్రోకర్ దేవినేని ఉమ అని నిప్పులు చెరిగారు. పట్టిసీమ ద్వారా ఎన్ని వేల ఎకరాలు సాగయిందో కృష్ణా జిల్లాలో ఎక్కడైనా తేల్చుకుందాం..? దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రావాలని జోగిరమేష్ దేవినేని ఉమకు సవాల్ విసిరారు.  తమ సవాల్ ను స్వీకరించే సత్తా బాబుకు గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ లేదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.  21మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. పామర్రు నియోజకవర్గం ఎన్టీఆర్ నియోజకవర్గం అని చెప్పుకుంటున్నారు. దమ్ముంటే అక్కడ మీ కండువా కప్పుకున్న ఉప్పులేటి కల్పనతో రాజీనామా చేయించాలని, అప్పుడు వైయస్సార్సీపీ సత్తా ఏంటో, టీడీపీ సత్తా ఏంటో తేలుతుందన్నారు. జగన్ కు పేరుందా, బాబుకు పేరుందో తెలుస్తుందని, స్వీకరించే సత్తా టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు.  

వైయస్ జగన్ పై ఆరోపణ చేయడం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని దేవినేని ఉమను హెచ్చరించారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు తగ్గించారని చెప్పి ఆ రోజు కృష్ణా జిల్లాలో సైకిల్ పై తిరిగిన వెదవవి నీవా మా గురించే మాట్లాడేది అంటూ దేవినేనిపై విరుచుకుపడ్డారు. పోతిరెడ్డి పాడు, పోలవరం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అన్నీ వైయస్ఆర్ పుణ్యమేనని జోగి రమేష్ స్పష్టం చేశారు. రాయలసీమకు వరాలు ఇచ్చింది  వైయస్ఆర్ మాత్రమేనని చెప్పారు. మూడేళ్లలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లు నిధులు వెచ్చించారో బయటపెట్టాలని దేవినేని ఉమను డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి పెట్టిన బిక్షతోనే చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు తప్ప ఆయన చేసిందేమీ లేదని తూర్పారబట్టారు. 1995 నుంచి 2004వరకు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడ కట్టిన పాపాన పోలేదన్నారు.  మేజర్, మైనర్, మీడియం ఏ ప్రాజెక్ట్ కట్టని,  వ్యవసాయమే దండగన్న చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కడతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వైయస్ఆర్  పుణ్యంతోనే ప్రాజెక్ట్ లన్నీ జరుగుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలులో  వేలాదిమందిని పోగు చేసిన నీ సభలో నందికొట్కూరుకు చెందిన మా ఎమ్మెల్యే వైయస్ఆర్ పేరు చెబితే ప్రజలు చప్పట్లు కొట్టి ఎగిరి గంతేశారని, అది మా వైయస్ఆర్ సత్తా అని అన్నారు. రాయలసీమ, ఏపీ ప్రజలు ఎప్పటికీ వైయస్ఆర్ ను మర్చిపోరని చెప్పారు.  

మూడేళ్లలో మూడు ఇళ్లు కూడ కట్టని దద్దమ్మ చంద్రబాబే
వైయస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్
అసత్య ప్రచారం, అబద్ధాలతో చంద్రబాబు మూడేళ్లు కాలపరిమితి చేశారని వైయస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లన్నీ పూర్తిగా మోసమని అన్నారు.  ఒకరోజు భూమిపూజ, మరో రోజు తాపీ పని, ఇంకో రోజు శంకుస్థాపన అంటూ  ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ బాబు జనాన్ని మోసం చేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు.  జనచైతన్యయాత్రలు, జన్మభూమి అన్నీ జనాన్ని మోసం చేసే యాత్రలేనని దుయ్యబట్టారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక వేలాది మంది పోలీసుల పహారాతో బాబు జన్మభూమి చేస్తున్నారన్నారు. పోలీసులు లేకుండా జన్మభూమికి వెళ్లే దమ్మూ, ధైర్యం టీడీపీ ప్రజాప్రతినిధులకు ఉందా..? అని ప్రశ్నించారు. జన్మభూమిలో ఖాకీ, పచ్చచొక్కాలు తప్ప ప్రజలు ఎవరూ లేరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో మూడు ఇళ్లు కూడా నిర్మించని దద్దమ్మ చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. జక్కంపూడి వైయస్ఆర్ కాలనీలోని ఇళ్లన్నీ వైయస్ రాజశేఖరరెడ్డి నిర్మించినవేనని,  వాటినే వీళ్లు అలాట్ చేస్తున్నారని చెప్పారు. జన్మభూమిలో ఇళ్లు, పెన్షన్లు, రేషన్, చంద్రన్న కానుక ఇస్తామనంటూ పాంప్లెంట్ లో రాసుకొని కంటితుడుపు చర్యగా చేస్తున్నారు. ఏది ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా అని అడిగి ఇస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలకు అప్లికేషన్లను అమ్ముకున్న ఘనత తెలుగుదేశం నాయకులదని దుయ్యబట్టారు.  ప్రజలు అన్నీ చూస్తున్నారని.. కపట నాటకాలు, అబద్ధపు పునాదులతో గద్దెనక్కిన బాబును దించే రోజులు దగ్గర్లో పడ్డాయన్నారు.  ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన  ఏ ఒక్క హామీని అమలు చేయని ముఖ్యమంత్రి దేశంలో బాబు మాత్రమేనని ఎద్దేవా చేశారు. అవినీతిలో నంబర్ వన్ ర్యాంకు సాధించిన బాబు ఘనతను యావత్ దేశం చూస్తోందన్నారు. ప్రజలకు అవసరం లేని ప్రాజెక్ట్ లు నిర్మిస్తూ... ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల పేరుతో  వేలకోట్లు ముడుపులు దండుకుంటున్నారని  ధ్వజమెత్తారు. పోలవరం పనులు ఇప్పుడు మొదలుపెడితే 2018నాటికి ఎలా పూర్తవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి మోసపూరిత నాయకులకు ప్రజలే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
Back to Top