దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం

అనంతపురం: తెలుగు దేశం పార్టీ మూడేళ్ల పాలనలో సర్వం అవినీతిమయం అయ్యిందని, అభివృద్ధి కుంటుపడిందని, ప్రజాధనాన్ని దోచుకుంటున్న దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గుంతకల్లు నియోజకవర్గ ప్లీనరీ పార్టీ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి,  పార్టీ నాయకులు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వై.శివరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాగే పరశురామ్, వై,సీతారామిరెడ్డి, భీమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్లీనరీకి భారీగా తరలివెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు
అనంతపురం: గుంతకల్లు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు గుత్తి మండలం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్థన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు మల్లయ్య యాదవ్, కౌన్సిలర్‌ నజీర్‌ అహ్మద్‌ ఆద్వర్యంలో సుమారు 1500 మంది గుంతకల్లు ప్లీనరీకి వెళ్లారు.

Back to Top