రావూరులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

నెల్లూరు: ఇందుకూరుపేట మండలంలోని రావూరు గ్రామంలో శుక్రవారం గడప గడపకు వైయ‌స్ఆర్ కార్యక్రమం జరుగుతుందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈకార్యక్రమానికి  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హాజరు కానున్నారన్నారు. కార్యకర్తలు,నాయకులు,అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు కోరారు. 

Back to Top