చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్‌లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రాణం పోయినా పార్టీ మారను
30 Jan 2018 11:48 AM
నూజివీడు : నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. నూజివీడును ఎవరూ చేయనంత అభివృద్ధిని తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశానని, దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అందించిన తోడ్పాటు చాలా గొప్పదని గుర్తు చేశారు. మహానేత కుమారుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన పార్టీలో ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. తాను ప్రజల మనిషినని, నిత్యం ప్రజలలో ఉండేవాడినని, రాబోయే ఎన్నికలలో తిరిగి గెలిచి నూజివీడు అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నిధులు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.