ముద్రగడ ప్రాణాలతో చెలగాటం వద్దు...అంబటి రాంబాబు

హైదరాబాద్) మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. హైదరాబాద్ లోటస్
పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ నిరాహార
దీక్ష విరమింపజేసేందుకు వచ్చిన మంత్రులు హామీలను నిలబెట్టుకోనందునే ఆయన కొనసాగిస్తున్నారు.
ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఆపడం కోసం ప్రభుత్వ నాయకులు పనిచేస్తున్నారని, ఫలితంగా ముద్రగడ
ప్రాణానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులున్నాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.   నా
శవాన్ని తీసుకెళ్లండి అంటూ ముద్రగడ ఇచ్చిన స్టేట్ మెంట్ చదివితే బాదేసిందని  ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు
మార్చుకోవాలని అంబటి రాంబాబు హితవు పలికారు.

 

Back to Top