రైతుల జీవితాలతో ఆడుకోవద్దు


–అవినీతిలో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ దేవినేని ఉమానే
–ప్రతిపక్ష నేతను కించపరిస్తే ప్రజలే బుద్ది చెబుతారు.
– వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు 

విజయవాడః రైతులు దిక్కుతోచని పరిస్దితులలో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంటే దేవినేని ఉమ తన పబ్లిసిటి పిచ్చి కోసం రైతులను బెదిరించి తీసుకువచ్చి పట్టిసీమ ద్వారా పంటలు పంటాయని  చెప్పించడం అత్యంత దారుణం అని వైయస్‌ఆర్‌ సీపీ  నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌ ,మల్లాది విష్ణు మండిపడ్డారు. మంత్రి చెబుతున్నట్లు పట్టిసీమతోనే  పంటలు పండాయో లేదో వాస్తవాలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ సీపీ నేతలతో కలిసి రైతుల వద్దకు వెళ్లి వాస్తవాలు తెలుసుకోడానికి రావాలని సవాల్‌ విసిరారు. మంత్రి చెప్పిన వాదన నిజమైతే తమ వాదనను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. 

 విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీరురువురూ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌  మాట్లాడుతూ  జిల్లాలో ఎక్కడ పంటలు పండటంలేదో క్షేత్రస్దాయిలో తిరిగి వాస్తవాలు తెలుసుకోండి....అమాయకులైన రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు.
  మైలవరం పక్కనే తిరువూరు నియోజకవర్గంలోని మినుము రైతులు అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేయిస్తుంటే తట్టుకోలేక పురుగుమందు తాగి సాక్షాత్తు పోలీసు స్టేషన్‌ లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం వాస్తవంకాదా? గొప్పగా చెప్పుకుంటున్న  పట్టిసీమ పరిథిలో పంటలు ఎలా ఎండిపోయాయో కళ్లముందు కనబడుతుంటే మీరు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు. రైతులను  బెదిరించి మీడియా ముందు మాట్లాడించడమా...గతంలో ఇలాగే గన్నవరంలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్‌ ఒక పొలంలోకివెళ్తే ఆ  రైతును బెదిరించి పోలీసు కేసు పెట్టించిన   విషయం అందరికి తెలిసిందే అన్నారు.  

పోలవరం  అవినీతికి పరాకాష్టగా మారిందని, పోలవారం కాదు మీ అవినీతి వారమని «ధ్వజమెత్తారు. పట్టిసీమ, పోలవరం వంటి ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లలో డబ్బు కమీషన్ల రూపంలో దండుకుంటూ దేవినేని ఉమ రాష్ట్రంలోనే అవినీతిలో నెంబర్‌ వన్‌ గా మారారని అన్నారు.  దమ్ము ధైర్యం ý ూడా ఉంటే జీవో నెంబర్‌ 22 పై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. 
ప్యారడైజ్‌ పత్రాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులు జగన్‌ చేసిన సవాల్‌ ను స్వీకరించే దమ్ము లేక పారిపోయారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి నాయకులు కుమ్మక్కై క జగన్‌ పై కుట్రలు పన్ని కేసులు పెట్టించిన విషయం,  కిషోర్‌ కుమార్‌ రెడ్డి పచ్చపార్టీలో చేరిన సందర్బంలో బయటపడిపోయిందని అన్నారు.
రాష్ట్రాన్ని విడిపోకుండా చివరి వరకు ప్రయత్నించింది కిరణ్‌ కుమార్‌ రెడ్డే అని చంద్రబాబు చెప్పడం అంటే రాజకీయాల కోసం ఎంతగా దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్దం అవుతోందన్నారు.సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నానంటూ ప్రజలను మోసం చేసి అఖరి నిముషం వరకు ముఖ్యమంత్రి పదవి పట్టుకుని వేలాడిన వ్యక్తి కిరణ్‌ కుమార్‌ రెడ్డి లాంటి వ్యక్తిని చంద్రబాబు  పొగడం రాజకీయాలలో ఉన్నవారందరూ సిగ్గుపడేలా ఉందన్నారు. 
 మల్లాది విష్ణు మాట్లాడుతూ పట్టిసీమ గురించి రైతులను బెదిరించే స్థాయికి దిగజారిన మంత్రి దేవినేని ఉమ అసలు పట్టిసీమకు సంబంధించి 24 మోటార్లను ఏరోజైనా ఆన్‌ చేశారా? లేదా? సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
పోలవరంకు అన్ని అనుమతులు తెచ్చి పట్టిసీమ నీరు పారించిన 177 కిలోమీటర్ల కాలువలో 150 కిలోమీటర్లు లైనింగ్‌ తో సహా పూర్తి చేసిన ఎక్కడ ఖ్యాతి దివంగత నాయకులు వైయస్‌ఆర్‌ కు ఎక్కడ  దక్కకూడదనే ఆలోచనతో టిడిపి రైతులతో కేసులు వేయించి పోలవరం ఆలస్యం చేయించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. 
 పట్టిసీమ నీటì తో కృష్ణా డెల్టా  సశ్యశ్యామలం అయిపోయిందంటూ చెబుతున్నారని నిజానికి ఈస్ట్రన్‌ ,వెస్ట్రన్‌ కెనాల్స్‌ కు 18 వేల క్యూసెక్కులు కావాల్సి ఉండగా, ఎప్పుడైనా 11 వేల క్యూసెక్కులకు మించి ప్రవహించిందా అని ప్రశ్నించారు.  వాస్తవానికి  డెల్టాలో ఎన్నడూ లేని విధంగా రెండోతడికి నీరు రాలేదని రైతులు చెబుతున్నారని తెలిపారు. రైతులు పట్టిసీమ ద్వారా నీరు రాకపోయినా ఎకరానికి ఐదువేల రూపాయలు ఖర్చు పెట్టి నీరు మోటార్ల ద్వారా తరలించి పంటలు పండిస్తే,  అదంతా పట్టిసీమ చలవ అంటూ టిడిపి ఖాతాలోకి వేసుకుంటున్నారని దీనిపై బహిరంగచర్చకు సిద్దం కావాలన్నారు. కృత్తివెన్ను మండలం రైతు సత్యరాజును బెదిరించి పత్రికా సమావేశంలో మాట్లాడించడం ఏంటి అని ప్రశ్నించారు.
 తాత్కాలిక ప్రాజెక్ట్‌ లపై దృష్టి పెట్టి పునరావాసం విషయంలో సరైన విధంగా వ్యవహరించకపోవడం వల్ల పోలవరం అంచనాలు పెరిగాయని అన్నారు. టిడిపి వైçఫల్యాలను కూడా  జగన్‌ పై రుద్దుతూ లబ్ది పొందాలను కోవడం నీచమన్నారు. ఇటువంటి వాటిని మానుకోండని హితవు పలికారు. రాయలసీమ ప్రాజెక్ట్‌ లలో టిడిపి ఎంపి సిఎం రమేష్‌ ఎంత అవినీతికి పాల్పడుతున్నారో  బహిరంగ రహస్యమేనని అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి మతిపోతున్న  ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అవినీతి అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.
 
 
Back to Top